వేతనాలు లే(క)ఖ…వేదనతో ఈ లేఖ..!శ్రీ సిఎం ఇంటికి ‘పోస్ట్‌’కార్డులు శ్రీ అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం

వేతనాలు లే(క)ఖ...వేదనతో ఈ లేఖ..!శ్రీ సిఎం ఇంటికి 'పోస్ట్‌'కార్డులు శ్రీ అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమం

వేతనాలు లే(క)ఖ…వేదనతో ఈ లేఖ..!శ్రీ సిఎం ఇంటికి ‘పోస్ట్‌’కార్డులు శ్రీ అంగన్‌వాడీల పోస్టుకార్డు ఉద్యమంప్రజాశక్తి – రేణిగుంట అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ చేస్తున్న సమ్మె గురువారానికి 17వ రోజుకు చేరుకుంది. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో గురువారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. ప్రతి ఒక్కరు పోస్టు కార్డుపై తమ డిమాండ్లను రాసి సిఎం ఇంటి అడ్రస్సుకు పోస్టు చేశారు. వేతనాల బాధను వేతనతో రాస్తున్నామని అంగన్‌వాడీలు పేర్కొన్నారు.- తిరుపతిలో పాత మున్సిపల్‌కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద పోస్టు కార్డులు రాశారు. తిరుపతి హెడ్‌పోస్టాఫీసు వద్ద 240 మంది అంగన్‌వాడీలు పోస్టు కార్డులను పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తాన్న ఆశతో తాముఉంటే, తమ కళ్లల్లోకారం కొట్టి చర్చల్లో సైతం సానుకూలత చూపడం లేదన్నారు. అంగన్‌వాడీలు అరుణ, గీత, రాజేశ్వరి, ఎల్లమ్మ, గోమతి, సుజిత పాల్గొన్నారు. – రేణిగుంటలో పోస్టుకార్డులతో పోస్టాఫీసు బాక్స్‌ వద్దకు ర్యాలీగా వెళ్లి పోస్టు చేశారు. గురువారం శిబిరం వద్ద రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. సిఐటియు జిల్లా కార్యదర్శి గురవయ్య, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అద్యక్షురాలు సౌజన్య, బిల్డింగ్‌ వర్కర్స్‌ కార్యదర్శి కృష్ణ, రిటైర్‌ టీచర్‌ రామకృష్ణ మద్దతు తెలిపారు. – శ్రీకాళహస్తిలో పోస్టుకార్డుల ద్వారా నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానంత వరకూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెనగడం గురవయ్య, గంధం మణి, రేవతి పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఇంద్రావతి,సిఐటియు నాయకులు బివి రమణయ్య, సురేష్‌ నాయకత్వం వహించారు. – బిఎన్‌ కండ్రిగలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు కళ్లకు గంతలు కట్టుకుని నిరవధిక సమ్మెలో ఎంపిడిఒ కార్యాలయం ముందు పాల్గొన్నారు. ఉత్తరాలను పోస్టు చేశారు. రాష్ట్ర కమిటి మెంబర్‌ శోభ, ప్రాజెక్టు కార్యదర్శి కె.సుదర్శన పాల్గొన్నారు. – నారాయణవనంలో ఎంఆర్‌ఒ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జడ్‌పిటిసి కోనేటి సుమంత్‌కుమార్‌, ఎంపిపి దివాకర్‌రెడ్డిలకు వినతిపత్రం అందించారు. – పుత్తూరు టౌన్‌లో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్ష కొనసాగించారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం డిప్యూటీ సిఎం నారాయణస్వామి ఇంటిని గురువారం ముట్టడించారు. అంగన్‌వాడీలను బెదిరించడం ఆపి, చేతనైతే అంగన్‌వాడీల జీతాలు పెంచుతూ జీవో ఇవ్వాలని డిమాండ్‌చేశారు. అనంతరం ఎస్‌ఐ గౌరీశంకర్‌కు వినతిపత్రం అందజేశారు. – నాయుడుపేటలో సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ నాయకులు సంధ్య, కళావతి, మేరి, ప్రమీల, నాగమ్మ, మునిరత్నమ్మ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.- కోటలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సిఎం చిరునామాతో లెటర్లు రాసి మండల అధ్యక్షురాలు పద్మలీలమ్మ ఆధ్వర్యంలో పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో సుందరమ్మ, రాధ, సరోజినీ పాల్గొన్నారు. – పిచ్చాటూరులో అంగన్‌వాడీల సమ్మెకు సత్యవేడు నియోజకవర్గ టిడిపి మాజీ ఎంఎల్‌ఎ హేమలత మద్దతు తెలిపారు. మాజీ ఎఎంసి ఛైర్మన్‌ డి.ఇలంగోవన్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️